RSS
Hello! Welcome to this blog. You can replace this welcome note thru Layout->Edit Html. Hope you like this nice template converted from wordpress to blogger.

Pages

వారికే చెల్లు ఈ పనులు


కొన్ని కొన్ని పనులను కొందరే చేయవలెను. ఇతరులు చేసిన... పనే కదా అని చేశావో పీక కోస్తా తరహాలో అయిపోవును. అటువంటి కొన్ని పనులు...








1. త్యాగం చెయ్యాలంటే సోనియా గాంధీ మాత్రమే చెయ్యాలి. కాదు కాదు. సోనియా గాంధీకే త్యాగం చేసే అర్హత ఉంది. ఆవిడ చేసిందే త్యాగం.

2. టెంప్ట్ కావాలంటే మహేష్ బాబే కావాలి. అంటే సూపర్‍స్టార్ కృష్ణ కాదు. మహేషే. అన్నగారు బాబు కదా :D

3. తొడగొట్టాలంటే బాలయ్య బాబే

4. మాటి మాటికీ మా తాత అనే అర్హత ఒక్క జూ ఎన్టీయారుకే ఉంది. ఎందుకంటే వారికి మాత్రమే స్వయం ప్రకాశం లేనిది. తాత అనందే, జనం తంతారు ఆ గ్లా౨మరుకు :D


5. ఓడిపోయినప్పుడు గాయం సాకు చూపే అర్హత సానియా మీర్జా కే ఉంది. ఇతరులకు కాదు

అయ్యో అసలు కథ :D


కంపుటేరు/టైపురైటరు కీబోర్డు నందు (సినిమాల్లో ఆర్తీ అగర్వాల్ పెట్టుకునే నందు, నందిని అనే పేరుకూ, దీనికీ ఏ సంబంధమును లేదని తెలియజేయుటకు చిదానించుచుంటిమి)

అనబడే (ఐ బడా/బడే అక్షరమే. ఎంత పొగరో దానికి. ఒహఠి లాగా ఉంటుంది. మరియూ ఇగో నకు సంకేతము. అసలైన ఇగో అయిన నేవిధమైన ఇబ్బందియు లేదు గాని, దాని యసలు యర్థము తెలియని వారికుండిన ఎన్నియో ఇబ్బందులు) అక్షరము ప్రక్కనే అను మరియొక అక్షరము కలదు. కమ్ప్యూటరు వాడక సమయమున ఐ బదులు ఓ, మరియూ ఓ బదులు ఐ వచ్చిన ఇబ్బందులు గూర్చి పలువురు పలుమార్లు వాపోయి యుంటిరి.
 
అట్టి సమయమున మనిషి వెలువరించు భావమునకు సంకేత రూపమొహఠి కలదు. దాని గూర్చి తరువాత చర్చించెదము. 

మన తెలుగు భాష యందలి పదమయిన అయ్యో ఎటుల వచ్చెననిన... కమ్ప్యూటరు కీబోర్డు వలన. ఇది పలువురకు యాశ్చర్యముగ తోచినను, ఇది యదార్థము. నిక్కము. సత్యము. ఐ, మరియు, ఓ ల వల్ల సమస్య ఉత్పన్నమైనది కాన దానికి సంకేత నామముగ ఐఓ అని ఉంచితిరి. క్రమముగ నదియె (ఏ నది కాదు. ఉంచిన అదియె అని భవము) ఐయో గను, ఆ పైన జనుల నోళ్ళ యందు నాని క్రమముగ అయ్యో గ స్థిర పడెను. అప్పటి నుంచీ, సమస్యలేవి యైనను ఉత్పన్నమయినప్పుడు మనుజులు అయ్యో అని అనుచుంటిరి

 
Copyright 2009 గీతాచార్య SSC. All rights reserved.
Free WordPress Themes Presented by EZwpthemes.
Bloggerized by Miss Dothy